ఐదు భాషల్లో 21న ‘వర్మ’ ఆగమనం!

Aagamana Movie Still

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం “వర్మ” (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ , సుపూర్ణ మలాకర్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. తొలుత ఈ చిత్రానికి ‘సైకో వర్మ” అనే టైటిల్ పెట్టాం. కానీ సైకో అనే పదానికి సెన్సార్ అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ పదాన్ని టైటిల్ లో తీసివేశామని నిర్మాత నట్టి కరుణ వివరించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్…