బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ…“ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన `పోయే ఏనుగు పోయే` చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా…