బచ్చు కొండలు సమర్పణలో ‘100 క్రోర్ బడ్జెట్ ఫిల్మ్స్’ పతాకంపై దైనందిన జీవితంలో జరిగిన నేరాలకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం ‘3E’. విశ్వనాధ్. బి దర్శకత్వంలో వేణు బచ్చు నిర్మించారు. వాస్తవ ఘటనలతో అనేక క్రైమ్ కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు చిత్ర విడుదల విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రపంచంలో క్రైమ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రైమ్‌కి సంబంధించి ఫైల్ అయిన కేసుల స్పూర్తితో ఓ అద్భుతమైన కథను తయారుచేయడం జరిగింది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నాము. అందరినీ ఎడ్యుకేట్ చేసే…