హ్యారి జోష్ తెలుగు తెరకు తిరుగులేని విలన్!!!

Harry Josh-the Most wanted Bollywood villain for Telugu silver screen!!

రామ్ చరణ్ “గేమ్ చేంజర్”, మంచు లక్ష్మి “ఆది పర్వం” చిత్రాలతో తెలుగులో రీ-ఎంట్రీ!! బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా వెలుగొందుతున్న “హ్యారి జోష్” “తెలుగులో ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను” అంటున్నాడు. “వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్” వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన హ్యారి… తెలుగులో అల్లు అర్జున్ తో వి.వి.వినాయక్ రూపొందించిన “బద్రినాథ్”లో ముఖ్య విలన్ గా నటించి టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు!! ఇప్పుడు మళ్లీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్”లో విలన్ గా నటిస్తున్న హ్యారి… మంచు లక్ష్మి మెయిన్ లీడ్ గా సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న “ఆది పర్వం”లో…