ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ…