తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ మట్టి కథలను, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న పల్లె కథలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్ లు. “స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్ లో జరిగిన ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు. చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ… 12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన నాకు దర్శకుడిగా మొదటి సినిమా…