మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ మళ్ళీ విడుదల చేస్తున్నాం: నిర్మాత ఆదిశేషగిరి రావు

సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మే 31న 'మోసగాళ్లకు మోసగాడు' మళ్ళీ విడుదల చేస్తున్నాం: నిర్మాత ఆదిశేషగిరి రావు

”పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు చిత్రం. ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని అన్ని హంగులతో 4కే లో మళ్ళీ విడుదల చేస్తున్నాం” అని తెలియజేశారు ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణగారి సోదరులు ఆదిశేషగిరి రావు. ఈ మేరకు విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అశ్విని దత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి. గోపాల్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాణంతోనే పద్మాలయ సంస్థ పునాదులు బలంగా నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడానికి మాకు స్ఫూర్తి రామారావు గారు. ఆయన ఎన్ఏటీ ద్వారా…