మహానటుడు ఎన్ .టి . రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్ .టి .ఆర్ శతజయంతి సందర్భగా భగీరథ “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి . ఆర్, అన్న పుస్తకాన్ని రచించారు, రామకృష్ణ ఈ శతాబ్ది హీరో అన్న పుస్తకం వ్రాశారు . ఎన్ .టి .ఆర్ శత జయంతి వేడుకలను మూడు రోజులపాటు తెలుగు విశ్వ విద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళా మందిరంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహించింది.రెండవ రోజు శుక్రవారం నాడు సీనియర్ జర్నలిస్ట్ భగీరథను, రామకృష్ణను తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి శాలువాతో సత్కరించారు . డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ బి . రాజగోపాలం రావు…