శకపురుషుడు ఎన్.టి.ఆర్: రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్

శకపురుషుడు ఎన్.టి.ఆర్: రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్

తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్.టి.ఆర్. శతాబ్ది సందర్భంగా, ఎన్.టి.ఆర్. శాసనసభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ ఆదివారం రోజు నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్.టి.ఆర్. సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని ఎన్.టి.ఆర్. నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప…