సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్‌లో ఈ…