‘రైటర్ పద్మభూషణ్‌’ మంచి హ్యుమర్, ఎమోషన్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆశిష్ విద్యార్థి

'రైటర్ పద్మభూషణ్‌' మంచి హ్యుమర్, ఎమోషన్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆశిష్ విద్యార్థి

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. రైటర్ పద్మభూషణ్‌ జర్నీ గురించి చెప్పండి ? మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది.…