డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఓ కొత్త కథతో ‘మాయా పేటిక’ అనే చిత్రం రాబోతోంది. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ.. ‘థాంక్యూ బ్రదర్ సినిమాను అందరూ ఆదరించారు. ఇది మా రెండో సినిమా. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉండదు. థియేటర్లో రాబోతోన్న మా…