‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ విడుదల

‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ విడుదల

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్ లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్ లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది. శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.…