టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకడైన సుహాస్ తన సినిమాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’లో స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో విడుదల చేసిన కాంతారా చిత్రం ఘనవిజయం అందుకుంది. కాంతారా ఘనవిజయం తర్వాత గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ‘రైటర్ పద్మభూషణ్’ ని విడుదల చేస్తున్నారు. ‘రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రానుంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి…
