‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఫర్హానా’. తమిళంలో సూపర్‌హిట్ అయిన మాన్ స్టర్, ఒరు నాల్ కూత్తు చిత్రాలు అందించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. మే 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ. నా మీద నమ్మకంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ్ లో విడుదల చేయడానికి…