‘నేను స్టూడెంట్ సర్’ మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : హీరో బెల్లంకొండ గణేష్ & టీమ్

‘నేను స్టూడెంట్ సర్' మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : హీరో బెల్లంకొండ గణేష్ & టీమ్

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ‘నేను స్టూడెంట్ సర్’ మంచి సినిమా. చాలా మంచి టెక్నిషియన్స్, నటీనటులు కలసి చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. ప్యాషన్ తో వర్క్ చేసిన టీం కి…