‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు రమణ మొగిలి బాగా తీశారు’’ అన్నారు శకలక శంకర్. పావని,భూపాల్ రాజ్, షాజీ షిండే ,మిర్చిమాధవి, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధర్మస్థలి’. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శకలక శంకర్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. రాజేంద్ర భరద్వాజ్ రాసిన మాటలు, వినోద్ యాజమాన్య చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఆడియెన్స్ నుంచి మచి స్పందన లభిస్తోంది ‘‘మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా ‘ధర్మస్థలి’ సినిమా…
