ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్టి పడేసే కోర్టు రూమ్ డ్రామా ఈ లిస్టులో చేరనుంది. అదే ‘వ్యవస్థ’. జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించారు. ఇంతకు ఆయన జీ 5లో వచ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెరకెక్కించారు. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ఇందులో ప్రధాన పాత్రధారులు. వ్యవవస్థ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుదల చేసింది. అందులో ఈరోజు న్యాయం…