ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డిగారు కలిసి కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ చంద్రుగారు హక్కులను మాకు ఇచ్చే విషయంలో మాకెంతో…