కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ డడ్లాని సంగీతానికి ఎల్లలు లేని ఒక ప్రపంచ స్థాయి భాష. అదే నేడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది. తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి చేరుతోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం…