‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ కోసం అందరితో పాటు నేనూ ఎదురు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా..

‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ కోసం అందరితో పాటు నేనూ ఎదురు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా..

సెకండ్‌ లిరికల్‌ విడుదల వేడుకలో ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి…