ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ప్రైమ్ ఛాయిస్. ఈ వేసవిలో, పూర్తి వినోదాన్ని అందించడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ థియేటర్ లోకి వస్తోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంది. టీజర్, టైటిల్ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ రెండవ సింగిల్ ‘సీతా కళ్యాణం’ పాటని విడుదల చేశారు. శ్రీరామ నవమి వేడుకకు తగిన పాట సీతా కళ్యాణ వైభోగమే. పాటంతా ఒక పండగలా వుంది. ఈ సీజన్‌లో పెళ్లి పాటగా అలరించబోతుంది. విజువల్స్ వివాహ వేడుకలను అద్భుతంగా చూపించాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ ఆహ్లాదకరమైన పాటను చిత్రీకరించడంలో నందిని…