భారత్ డి.ఎమ్.ఎఫ్ డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 .. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఎక్సలెన్స్ వేడుక

Bharat DMF Digital Icon Awards 2025 — India’s Biggest Celebration of Digital Excellence

హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం మరియు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్ ను ఒక చోటకు చేర్చింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ ఐ.అండ్ పి. ఆర్ విభాగం ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఐ.ఏ.ఎస్ పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగింస్తూ “డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం…