సత్య వినుగొండ, అను శ్రీ, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వాషింగ్టన్ సుందర్’. యస్.యస్. మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై బిపేట ప్రేమ్ కుమార్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధపడుతున్నారు. సత్య వినుగొండ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ రాజ్ బొబ్బిలి చక్కటి సంగీతాన్ని అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి సాంగ్ ని సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్బంగా హీరో, దర్శకుడు సత్య వినుగొండ మాట్లాడుతూ.. ”చిన్నప్పుడు తన సొంత ఊరును వదిలిపెట్టి పారిపోయిన కుర్రాడు మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఎందుకొచ్చాడు? వచ్చిన ఆ కుర్రాడు ఆ ఊరికి ఏం చేశాడు? మళ్లీ…
Day: October 6, 2025
హీరో సూర్యతేజ పసుపులేటి బర్త్ డే సందర్బంగా ‘మన ఊరి ప్రేమాయణం’ టైటిల్, లోగో లాంఛ్
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ వీరాభిమాని అయిన సూర్యతేజ పసుపులేటి కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి కెరటంలా దూసుకొస్తున్నారు. ఆయన హీరోగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘మన ఊరి ప్రేమాయణం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అలమేలు మంగమ్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, లోగోని హీరో సూర్యతేజ పసుపులేటి జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత సీనియర్ నటుడు సుమన్ లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె. ఎన్ రాజు, డీఓపీ ఎడిటర్ ఉదయ్ కుమార్ జి., ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మూవీ టీమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో సూర్యతేజ పసుపులేటి మాట్లాడుతూ.. ‘మన ఊరి ప్రేమయాణం’ ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే…
