హీరోలు అవసరం లేదు, కంటెంట్ ఈజ్ కింగ్ అని ‘వైల్డ్ బ్రీత్’ ప్రూవ్ చేస్తుంది : ప్రముఖ నటుడు శివాజీ రాజా*

'Breath of the Wild' proves that heroes are not needed, content is king: Veteran actor Sivaji Raja

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్ ను ఈ రోజు యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్…