భారతీయ సినిమాకు సేవల విషయంలో ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024గానూ చిరంజీవికి ఆయన పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అక్కినేని కుటుంబం, చిరంజీవిని కొనియాడారు. ”తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలో ఏఎన్నార్ సత్తా చాటారు. తన నటనతో ఎంతోమందికి వినోదం పంచారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నా కుమారులు.. నా కుమారులైనంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో.. వారే నా కుమారులవుతారు అంటూ తన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ రాసిన ఓ కవితను ప్రస్తావిస్తూ.. ఏఎన్నార్ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం దీన్ని నిరూపించిందన్నారు. ఎప్పుడు…
Day: October 29, 2024
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి టెన్షన్ పడ్డా: తొలినాటి అనుభవాలను పంచుకున్న నాగార్జున
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి కాస్త టెన్షన్ పడ్డానని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన.. ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. 2024గానూ ఆ పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..చిరంజీవి హిట్లు, సూపర్‌హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. నేను సినిమాల్లోకి రావాలనుకునే సమయంలో.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. నాన్న నన్ను పిలిచి.. ‘చిరంజీవి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్ కదా వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని చెప్పారు. నాన్న చెప్పినట్టుగా షూటింగ్ చూసేందుకు వెళ్లా.. అది రెయిన్ సాంగ్. వైట్ అండ్…
అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం
* నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత : అమితాబ్ బచ్చన్‌పై చిరంజీవి పొగడ్తలు నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అంటూ..ఆయనకు అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడైనా అవార్డు వచ్చినా ఆయన నుంచే తొలుతగా నాకు శుభాకాంక్షలు వస్తాయని గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు ఇలా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయన లాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం ఆనందదాయకం అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల విూదుగా అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఏఎన్నార్, అమితాబ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పద్మ…