విజయ సేతుపతి “విక్రమార్కుడు” సెప్టెంబర్ 20న రీ రిలీజ్ !!!!

Vijay Sethupathi Vikramarkudu re release on September 20.

రీ రిలీస్ ల హంగామా నడుస్తోంది, మంచి సినిమాలు ఎప్పుడూ వచ్చినా ఆడియాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన చాలా సినిమాలు రీ రిలీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. హీరో విజయ్ సేతుపతి నటించిన జుంగా చిత్రం తమిళం లో 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. తమిళ్ లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో సాయేశా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు. గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బస్సు సర్వీసులో టికెట్ కలెక్టర్ గా విజయ్ సేతుపతి నటన అద్భుతం. అలాగే గ్యాంగ్ స్టర్ పాత్రలో కూడా నటించాడు. రెండు విభిన్నమైన రోల్స్ లో బాగా నటించాడు. ఇప్పడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి…

తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Andhra Pradesh Deputy CM Pawan Kalyan praised Telugu Indian Idol 3 contestants

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగానే ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్‌లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్‌లు 5,000 మంది పాల్గొనేవారి నుండి విశేషమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ ఆకట్టుకునే పూల్ నుండి, భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం…

‘ఆహా’ ఓటిటిలో ‘సత్య’ స్ట్రీమింగ్‌

'Satya' streaming in 'Aaha' OTT

హమరేశ్, ప్రార్ధనా సందీప్‌ జంటగా నటించిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’. వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడు. శివమ్‌ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా మారి తమిళ చిత్రం ‘రంగోలి’ ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్‌ తండ్రిపాత్రలో ఎంతో గొప్పగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. గవర్నమెంట్‌ కాలెజి కంటే ప్రవేట్‌ కాలేజి అయితే మంచి అలవాట్లు చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ చిత్రం ఎమోషనల్‌ హిట్‌గా నిలిచింది. అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రవేట్‌ స్కూల్స్, కాలేజిల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’ . వినాయకచవితి సందర్భంగా…

ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!

Uruku Patela Movie Review: Mind blowing comedy thriller!

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్ కంచ‌ర్ల‌, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…

SPEED220 మూవీ  రివ్యూ : అలరించే ప్రేమకథ!

SPEED220 Telugu Movie Review

యువతరాన్ని ఎంగేజ్ చేసే సినిమాలకి  టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది.  అందుకే నవతరం  దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా  బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది.  అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో  కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు  దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం  ప్రేక్షకుల…