రాంచరణ్ తో సాయిపల్లవి!

Sai Pallavi with Ramcharan!
Spread the love

రామ్‌ చరణ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఓవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో పాలు పంచుకొంటున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది వరకు శ్రీలీల పేరు బయటకు వచ్చింది. ఆమె స్థానంలోకి సాయి పల్లవి వచ్చిందా? లేదంటే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలా? అనే సంగతి తెలియాల్సివుంది. 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్‌ చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించనున్నారు. రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Leave a Comment