ఆయన సలహాలు వింటానంటోంది మెహరీన్‌!?

Mehreen wants to listen to his advice!?
Spread the love

‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాలో మెహరీన్‌ను చూసిన అందరూ కాజల్‌ చెల్లెలా? అనే అనుమానం వ్యక్తం చేశారు. బొద్దుగా, ముద్దుగా ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది మెహరీన్‌. ఆ తర్వాత ఏమైందో.. బొద్దుగా ఉంటే అవకాశాలు రావని ఎవరైనా చెప్పారేమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి తగ్గిపోయి సన్నగా తయారైంది. ఓ దశలో జీరో సైజ్‌కి మారిపోయింది కూడా. నిజానికి బొద్దుగా ఉన్నప్పుడున్న అందం సన్నబడ్డాక కనిపించడంలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ‘స్పార్క్‌ లైఫ్‌’ సినిమాలో మెహరీన్‌ అటు బొద్దుగా కాకుండా, ఇటు సన్నగా లేకుండా మధ్యస్థంగా ముద్దుగా కనిపించింది. ఇటీవలే ఆమె దర్శకుడు మారుతిని కలిసింది. మెహరీన్‌ను చూసిన మారుతీ.. ‘ఇప్పుడు చాలా బావున్నావు. నా ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాలో చాలా సన్నగా ఉన్నావు. ఇదే మెయింటెయిన్‌ చెయ్‌’ అన్నాడట. మారుతీ సలహాని పాటిస్తానని, ఇకనుంచి ఇదే లుక్‌ని మెయింటెయిన్‌ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చేసింది మెహరీన్‌.

Related posts

Leave a Comment