హ్యాపీబర్త్ డే నయన్‌.. శుభాకాంక్షల వెల్లువ!

Happy birthday Nayan.. Best wishes!
Spread the love

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భర్త విఘ్నేష్‌ శివన్‌ కూడా నయన్‌కి స్పెషల్‌గా విషెస్‌ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే నయనతార. లవ్‌ యూ మై ఉయిర్‌, ఉలగం. నా జీవితం యొక్క అందం, అర్థం మీరు.. మీ సంతోషమే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్‌, విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌ శివన్‌, ఉలగ్‌ దీవిక్‌ ఎన్‌ శివన్‌ అని నామకరణం కూడా చేశారు. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటీమణుల్లో టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది నయనతార . గ్లామరస్‌ పాత్రలు చేస్తూ.. మరోవైపు పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌లో నటిస్తూ లేడీ సూపర్‌ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ‘జవాన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ఇక నయనతార పుట్టినరోజు. 1984 నవంబర్‌ 18న ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. నేటితో 38 ఏళ్లు పూర్తిచేసుకుని 39లోకి అడుగుపెట్టింది. కాగా.. నయన్‌ బర్త్‌డే సందర్భంగా పలు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో విషెస్‌ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నయన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘టెస్ట్‌’. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే బర్త్‌డే కానుకగా ఈ సినిమా నుంచి నయన్‌ కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నయనతార ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇక వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్రన్‌, శశికాంత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయానేది ఈ సినిమా స్టోరీ అని మేకర్స్‌ వెల్లడించారు.

Related posts

Leave a Comment