రూపేష్ కథానాయకుడిగా MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 37 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ కథానాయిక. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. లుక్ చాలా బావుందని, దర్శకుడు పవన్ ప్రభకు ఇది తొలి చిత్రమైనప్పటికీ చక్కగా డిజైన్ చేశారని, సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ”పిల్లలు ఎవరైనా తమ తల్లిదండ్రుల పెళ్లి చూడలేరు. షష్టిపూర్తి ద్వారా ఆ లోటు తీర్చుకునే అవకాశాన్ని…
Category: Entertainment
54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ధూత’ ను ప్రదర్శించిన ప్రైమ్ వీడియో
హీరో నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ హాజరైన ఈ సిరీస్ ప్రీమియర్ ప్యాక్డ్ హౌస్‌తో ప్రారంభమై, ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. భారతదేశంలో అందరూ ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్ ప్రైమ్ వీడియో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ సూపర్‌నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ ‘దూత’ ను ప్రస్తుతం జరుగుతున్న54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించింది. ప్రీమియర్‌కు సిరీస్‌లోని ప్రధాన తారాగణం నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత శరత్ మరార్, దర్శకుడు…
వరలక్ష్మీ శరత్ కుమార్ ‘కూర్మ నాయకి’ ప్రారంభం
వెర్సటైల్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కె హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న యూనిక్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కూర్మ నాయకి’. రోహన్ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్ బ్యానర్స్ పై కె విజిత రావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి వి వి దానయ్య క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కెమెరా స్విచ్ ఆన్ చేయగా బెక్కం వేణుగోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేస్తారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్.…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2024, మార్చి 8న విడుదల కానుంది!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపారు. ప్రకటన నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో…
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నా కెరీర్ బెస్ట్ క్యారెక్టరైజేషన్ చేశా : హీరో నితిన్
టాలెంటెడ్, ఛర్మిస్మేటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో … నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడను. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను’’ అన్నారు. డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ ఔట్ పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డామని చెప్పకూడదు. ఎందుకంటే…
ప్రముఖ నటుడు డాక్టర్ నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం- ఏఎంబి లెఫ్టినెంట్ కల్నల్ ‘సర్’ డాక్టరేట్ బిరుదు ప్రదానం
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ (ISCAHR), UNO ముఖ్యమైన విభాగం NATOతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్లోని ఆటం హాల్లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది. ఈ సమావేశానికి NASDP సెక్రటరీ జనరల్ AMB జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఆరోగ్యమంత్రి, నేవీ, ఎయిర్ వింగ్ ,గ్రౌండ్ ఫోర్స్‌కు చెందిన 12 మంది మిలిటరీ జనరల్స్, అనేక మంది బ్రిగేడ్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్లు, దేశాల డిప్యూటీ మంత్రులు,…
Actor Naresh is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D
The National Academy of Security and Defence Planning (NASDP) and International Special Court of Arbitration & Human Rights (ISCAHR), an important wing of UNO (registered with NATO, European Union, USA and many other countries held its 5th World Congress in Autumn Hall in Luxent hotel in Quezon city in the Philippines (Manila) on the 24th of this month. The meeting was preceded by AMB Gen. Sir Diwakar Chandra Sarkar, Secretary General Of NASDP. The chief policy advisor of the Philippines country Miss Clarita R Carlos, the minister for health 12…
‘కోట బొమ్మాళీ పీఎస్’ లాంటి సినిమా తీయాలంటే గట్స్ వున్న నిర్మాతలు కావాలి: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్టుతో మరో సారి ప్రూవ్ అయింది. నాయట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది.…
తండ్రి కొడుకుల కథ ‘యానిమల్’ అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. సందీప్ గారు.. ముందుగా మీకు కంగ్రాట్స్..…
శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
హారర్ కామెడీ జోనర్లో అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్లో భారీ బడ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.…