‘రౌడీ స్టార్’ చీప్ ట్రిక్స్ … దసరా రోజు ఫ్యాన్స్ కు బిస్కట్ వేసిన విజయ్ దేవరకొండ!

vijaya devarakonda still
Spread the love

విజయదశమి పండగ రోజు ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా పేరుతో బిస్కేట్స్ వేశాడు. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి తెగ ప్రయత్నించాడు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు. ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు విజయ్. అలాగే మీతో ‘లైగర్’ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోని థియేటర్ లో ‘లైగర్’ మూవీ చూద్దామని చెప్పి ఖుషీ చేయడానికి ప్రయత్నిచాడు. ఇంకొక అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్ ఫ్రీ అని అతన్ని సర్ ప్రైజ్ చేశారు. మన రౌడీ గ్యాంగ్ అందరితో కలిసి ‘లైగర్’ మూవీ చూద్దామని మరికొందరు అభిమానులకు ప్రామిస్ చేసి వారిని సంతోషపెట్టారు. ప్రభాస్ ను కలిపించండి అని కోరిన ఇంకో అభిమానికి, ఓకే డన్ అంటూ చెప్పారు. ఇలా తన అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరించాలని చాలా రోజులుగా అనుకుంటున్న విజయ్..తన సినిమా షూటింగ్ బిజీలో చేయలేకపోయారు. కానీ పండగ టైమ్ లో ఫ్యాన్స్ తో కాసేపు ట్విట్టర్ ద్వారా ముచ్చటించి వారు తనపై చూపించే అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఫ్యాన్స్ ను కూడా ఈ విధంగా కల్లబొల్లి మాటలతో బిస్కట్స్ వేస్తూ.. వారిని ఆకట్టుకునేందుకు విజయ్ దేవరకొండ చేసిన ట్రిక్కులను చూసి హవ్వ… విజయా మజాకా! అని ముక్కున వేలేసుకుంటున్నారు. దమ్ముంటే ఫ్యాన్స్ కు హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇవన్నీ ‘రౌడీ స్టార్’ చీప్ ట్రిక్స్ అని అంటున్నారు. అదీ.. సంగతీ!!

Related posts

Leave a Comment