ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా!

RRR MOVIE VIDUDHALA VAYIDA
Spread the love

ఇప్పుడు టాలీవుడ్ లో అంతా అయోమాయం చోటుచేసుకుంది. జ‌నవరి 7న వస్తుందనుకున్న ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదాపడడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన ట్రిపుల్ ఆర్ విడుదల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కొంత కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రానికి కరోనా, ఒమిక్రాన్ ల దెబ్బ తగిలి విడుదల వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు కాబట్టి నైట్ షో లు రెండూ పూర్తిగా ఎఫెక్ట్ అవడం ఖాయం. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీ. గుజ‌రాత్, ఢిల్లీ ఇలా ఒక్కోక్క చోట ఒక్కో రకమైన నిబంధనలు అమలు చేయడం ప్రారంభమైంది. చెన్నయ్ లో కూడా రూల్స్ వచ్చాయి. అయితే.. అంతా సర్దుకుంది. ట్రిపుల్ ఆర్ సినిమా ప్లానింగ్ ఫిక్స్ అయింది అనుకంటే మళ్లీ వ్యవహారం ఇలా మొదటికి వచ్చింది. బహుశా కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ట్రిపుల్ ఆర్ సినిమా ఏప్రిల్ తొలివారంలో వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ట్రిపుల్ ఆర్ కోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ వెనక్కి తగ్గడంతో ‘భీమ్లానాయక్’ మళ్లీ ఈ జనవరిలోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ‘భీమ్లానాయక్’ మూవీ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!?

Related posts

Leave a Comment